
maknews : ఇల్లంతకుంట మండలంలోని అనంతారం,తాళ్లల్లపల్లి గ్రామంలో రెండో విడత స్థానిక గ్రామపంచాయతీ ఎన్నికలలో గ్రామ సర్పంచ్‌గా గెలుపొందిన వొల్లాల రజిత-వెంకటేశం, మీసాల కనుకరాజు మరియు వార్డు సభ్యులు మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణను బుధవారం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.కార్యక్రమంలో సర్పంచ్,ఉప సర్పంచ్,వార్డు మెంబర్లను శాలువలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఉట్కూరి వెంకట రమణారెడ్డి, పార్టీ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, చల్లనారాయణ,
ఫ్యాక్స్ మాజీ చైర్మన్ ఐరెడ్డి మహేందర్ రెడ్డి,ఉపసర్పంచ్ గోర్ల కమలాకర్, వార్డు సభ్యులు సందీప్, కవిత, శ్రీకాంత్, కేతశ్రీనివాస్, రవీందర్, మూడపెల్లి చందు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.