
-ముమ్మరంగా పులి కోసం రెస్క్యూ టీం ఆపరేషన్
-4 ట్రాప్ కెమెరాల ఏర్పాటు
-ప్రజలను అప్రమత్తం చేస్తున్న ఫారెస్ట్ అధికారులు
-భయం భయంగా సమీప గ్రామాల ప్రజలు
మూడు ఆవు దూడలను చంపిన పులి కోసం ఫారెస్ట్ అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారు. పులి ఆనవాళ్లను గుర్తించే విధంగా ఇప్పటికే మండలంలోని తిప్పాపూర్, సిరికొండ, అనంతగిరి, పెద్ద లింగాపూర్ గ్రామాల పరిధిలో అక్కడక్కడ 4 ట్రాప్ కెమేరాలను అమర్చారు. పులి జాడ కోసం ఎప్పటికప్పుడు ఫారెస్ట్ అధికారులు ,రెస్క్యూ టీం తో ఆపరేషన్ మొదలుపెట్టారు. డీఎఫ్ఓ సి.హెచ్ బాలమణి నేతృత్వంలో ఆపరేషన్ జరుగుతుంది.

ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి: డిఎఫ్ఓ బాలామణి
ఇల్లంతకుంట మండలంలోని తిప్పాపూర్ ,అనంతగిరి, పెద్ద లింగాపూర్ ,సిరికొండ ,సమీప గ్రామ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని డిఎఫ్ఓ సిహెచ్ బాలమణి తెలిపారు. అనంతగిరి గ్రామంలో ఫారెస్ట్ అధికారులతో కలిసి ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తుల కు అవగాహన కల్పించారు. ఉదయం 9 గంటల తర్వాత వ్యవసాయ పొలాల వద్దకు ప్రజలు వెళ్లాలని, అదేవిధంగా సాయంత్రం ఐదు గంటలలో పే వ్యవసాయ బావి నుండి తప్పనిసరిగా ఇంటికి రైతులు తిరిగి రావాలని కోరారు. రైతులు వ్యవసాయ పొలాల వద్ద పశువులను ఉంచవద్దని, ఇంటి వద్ద రాత్రి వేళలో పశువులను కట్టెయ్యాలని కోరారు. పులి జాడ కోసం ఫారెస్ట్ రెస్క్యూ టీం ఆపరేషన్ చేస్తుందని, ప్రజలందరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు.

అంతగిరి పోచమ్మ ను దర్శించుకున్న: డి ఎఫ్ ఓ
ఎంతో ప్రసిద్ధిగాంచిన అనంతగిరి పోచమ్మ తల్లిని డిస్టిక్ ఫారెస్ట్ అధికారిని (డిఎఫ్ ఓ) సిహెచ్ బాలమణి తన సిబ్బందితో కలిసి బుధవారం దర్శించుకున్నారు. సర్పంచ్ అరుకాల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఫారెస్ట్ అధికారులకు ఘన స్వాగతం పలికి, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ ఆర్ వో కల్పనా దేవి, ఎఫ్ బి ఓ వసుమతి, అనిల్ , ఆలయ చైర్మన్ కొలపురి అంతగిరి, ముత్యం గౌడ్, తదితరులు పాల్గొన్నారు.