
maknews/ఇల్లంతకుంట
గత తొమ్మిది రోజులుగా సాగునీటి కోసం రైతులు రిలే నిరాహార దీక్ష చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింపు లేదా అని బిజెపి మండల శాఖ అధ్యక్షుడు భూమల్ల అనిల్ కుమార్ విమర్శించారు. గత తొమ్మిది రోజులుగా రంగనాయక సాగర్ నుండి 11/6 కాలువ అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేయాలంటూ 12 గ్రామాల రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు బిజెపి మండల శాఖ అధ్యక్షుడితో పాటుగా, నాయకులు వెళ్లి సంఘీభావం తెలిపారు. అనంతరం అనిల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నాడు పూర్తిస్థాయిలో కాలువ పనులు చేస్తామని హామీ ఇచ్చిందని, నేటికీ హామీని అమలు చేయడం లేదన్నారు. రానున్న వేసవి కాలంలో రైతులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని, వెంటనే ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే స్పందించి కాల్వ పనులు పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మారవేణి రాజు ,కరికే నవీన్, పయ్యావుల బాలయ్య, గాదె మధుసూదన్ ,ఈర దేవరాజు ,ధూమాల రాజు, ఎద్దు నరసయ్య ,కొమ్ముల పరశురాములు, అక్కి శ్రీనివాస్, సేరుఎల్లం, జంగిటి కనకయ్య, జంగిటి మోహన్ ,పయ్యావుల మల్లేశం, రవి తదితరులు పాల్గొన్నారు.