
✍️Ⓜ️🅰️K NEWS కొయ్యడరాజయ్య గౌడ్
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వజయంతి వేడుకలను సోమవారం గౌడ కులస్తులు ఘనంగా నిర్వహించారు. అనంతరం పాపన్న గౌడ్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గౌడసంఘం అధ్యక్షుడు కొయ్యడ రాజయ్య మాట్లాడుతూ పీడిత జనుల కోసం, బహుజనుల ఆత్మగౌరవం కోసం తన సర్వస్వాన్ని దారబోసిన మహాయోధుడు పాపన్న అని కొనియాడారు.మొఘల్ సామ్రాజ్యవాదాన్ని, సైన్యాన్ని సైతం ఎదిరించి నిలబడిన వీరుడు పాపన్న అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కొయ్యడ రాజయ్య, ప్రధాన కార్యదర్శి బండారి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ కొయ్యడ భాస్కర్,మాజీ వైస్ ప్రెసిడెంట్ అంతటి శ్రీనివాస్, బండారి రాజు(డైమండ్), అంతటి శ్రీకాంత్, అంతటి సత్తయ్య, ముత్యం మల్లయ్య, కొయ్యడ శ్రీకాంత్ పాల్గొన్నారు.