
✍️Ⓜ️🅰️K NEWS
జర్నలిస్ట్ గా…వకీల్ సాబ్ గా మంచి పేరు తెచ్చుకున్న పూర్వ ఏబివిపి నాయకుడు రాకం సుమన్ మరో సారి వార్డ్ మెంబర్ గా గెలుపొంది సత్తా చాటాడు. రెండో విడతలో జరిగిన సర్పంచ్ ఎన్నికలో ఇల్లంతకుంట మండల కేంద్రంలో 8వ వార్డు సభ్యుడిగా పోటిలో నిలిచాడు. ఉత్కంఠ బరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో ప్రత్యర్థుల పై విజయం సాధించి..రాకం సుమన్ తన పట్టు నిలుపుకున్నాడు. సీనియర్ పాత్రికేయుడిగా, వకీల్ సాబ్ గా మండల ప్రజలకు సేవలిందిస్తూ..రాజకీయంగా ముందుకు వెళ్తున్నాడు. సుమన్ గెలుపు పట్ల జర్నలిస్ట్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.