
-కేక్ కట్ చేసిన ఫోటో&విడియోగ్రాఫీ యూనియన్
వేయి మాటలతో చెప్పే అర్ధాన్ని ఒక్క ఫోటో ద్వారా చెప్పవచ్చని మండల ఫోటో,విడియోగ్రాఫర్స్ మండల అధ్యక్షుడు గూడ బాబు అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ వద్ద ఫోటో, వీడియో గ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కెమెరా సృష్టికర్త “లూయిస్ డాగురే” చిత్రపటానికి పూలమాలలు వేసి ఫోటోగ్రఫి
కేక్ కట్ చేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఫోటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు గూడ బాబు మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్లకు జీవన వృత్తి కల్పించిన గొప్ప వ్యక్తి డాగురే అని అన్నారు. ఆయన చేసిన కృషితోనే తమ కుటుంబాలు ఈ స్థాయికి వచ్చాయని ఆయన గొప్పతనాన్ని కొనియాడారు. ఫోటో వృత్తిలో ఉన్న యజమానులను ప్రభుత్వం గుర్తించి సంక్షేమ పథకాలు అందించి ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గుర్రాల మోహన్, మఠం తిరుపతి, పిట్టల యాదగిరి, ఎండ్ర రాజు, మ్యాక శ్రీధర్, సార్గు వంశీ తదితరులు పాల్గొన్నారు.