
ఉపాధ్యాయురాలిని అభినందించిన ప్రిన్సిపాల్ జీ గంగాధర్
✍️Ⓜ️🅰️K NEWS ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట గ్రామంలోని ఆదర్శ పాఠశాల (మాడల్ స్కూల్) లో జువాలజీ (జీవశాస్ర్తం) ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న “గోవత్రిరాగ మల్లిక”పిహెచ్ డి(ph.D) పట్టా అందుకున్నారు. మంగళవారం హైదరాబాదులో జరిగిన ఉస్మానియా యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ శర్మ, ఇస్రో చైర్మన్ వి నారాయణ, ఓయు విసి ల చేతుల మీదుగా ఆమె పిహెచ్ డి పట్టాను అందుకున్నారు. ఇంసెక్ట్ పేస్ట్ మేనేజ్మెంట్ ఇన్ టక్టోనా గ్రాండిస్ అనే అంశంపై ప్రొఫెసర్ ఎం మాధవి పర్యవేక్షణలో పరిశోధనలు చేసి, ఆమె ఈ పట్టాను పొందారు. ఆదర్శ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు పట్టా పొందడంతో పాఠశాల ప్రిన్సిపల్ గంగాధర్ తో పాటుగా, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు, మాలికను అభినందించారు.