
అన్నం పెట్టే రైతును అనాథ చెయ్యద్దు:మందఅనిల్
✍️Ⓜ️🅰️K NEWS
రైతులకు యూరియా బస్తాలు అందించడంలోకేెంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలు శ్రద్ద చూపడం లేదని, దీంతో యూరియా దోరకక రైతులు ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మంద అనిల్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎరువులు, యూరియా బస్తాల కోట తగ్గించి రైతుల ను ఇబ్బందికి గురి చేస్తున్నారన్నారు. పండించిన పంటలను కొనడానికి కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు రైతులను నెలల తరబడి నిరీక్షించేలా చేస్తున్నారని, ఇప్పుడేమో ఎరువులు యూరియా కోసం వారాలు,నెలలు తరబడి వేచి చూస్తున్న రైతన్నల బాధలు అర్థం కావటం లేదని మండిపడ్డారు. రైతే రాజు అని చెప్పే ప్రభుత్వాలు ఆచరణలో పెట్టడంలో పూర్తిగా విఫలం అయ్యాయన్నారు. “అన్నం పెట్టే రైతును అనాధ చెయ్యద్దు” రైతే రాజు అని మాటలకు పరిమితం అవుతున్న ప్రభుత్వాల తీరు మార్చుకోవాలని,రైతున్నలకు మభ్య పెట్టీ గద్దనెక్కి గాడి తప్పుతున్నాయన్నారు. తగిన సమయానికి పంట,పొలాలకు ఎరువులు, యూరియా వెయ్యకపోగా రైతులు తీవ్ర నష్టాలతో పంట దిగుబడికి దూరం అవుతూ , భూమి లేని నిరుపేద రైతులకు కౌలు మీద పడే పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికైన వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు నాణ్యమైనవిత్తనాలు,ఎరువులు,యూరియా అందించిఅందుకోవాలి డిమాండ్ చేశారు. ఇప్పటికైన రైతుల బాధలు తీర్చుకుంటే ఉద్యమలు ఉద్రిక్తం అవ్వక తప్పదు అని హెచ్చరించారు.