
-మధ్య మానేరు, అనంతగిరి జలాశయం నుంచి నీటి విడుదల చేసిన ఎమ్మెల్యే
-15వేల ఆయ కట్టు కోసం భూసేకరణ చేపట్టుతాం
-ప్రతిఏకరాకు సాగునీరందిస్తాం
✍️Ⓜ️🅰️K
రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయమని, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకే ముందస్తుగా జలాశయాల నుండి నీటిని విడుదల చేయడం జరుగుతుందని మాన కొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపెల్లి సత్యనారాయణ అన్నారు. శనివారం ఇల్లంతకుంట మండలంలోని ‘మద్య మానేరు’ జలాశయంతో పాటుగా, ‘అనంతగిరి’ (అన్నపూర్ణ) ప్రాజెక్టుల ద్వారా నీటిని విడుదల చేశారు. ముందుగా రెండు ప్రాజెక్టులలో ఎమ్మెల్యే జల పూజ కార్యక్రమాన్ని చేపట్టి, పుష్పాలతో జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యమానేరు జలాశయం నుండి 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం జరిగిందని, దీంతో ఇల్లంతకుంట మండలం తో పాటుగా గన్నేరువరం ,గౌరవెల్లి వరకు నీరు వెళ్తుందని, రైతులకు మేలు జరుగుతుందన్నారు. అదేవిధంగా అనంతగిరి (అన్నపూర్ణ) జలాశయం ద్వారా నీటిని విడుదల చేయడం జరిగిందని. 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని, ఇల్లంతకుంట మండలం తో పాటుగా, బెజ్జెంకి రైతులకు కూడా నీరు సాగుకు ఉపయోగిస్తున్నారు అన్నారు. ఇప్పటి వరకు 15 వేల ఆయకట్ట ద్వారా రైతులకు నీటిని అందిస్తున్నామని, మరో 15వేల ఆయకట్టు కోసం భూసేకరణ చేపట్టుతామన్నారు. మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి తో మాట్లాడి భూసేకరణ చేపట్టి, రైతులకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
పర్యటక కేంద్రంగా మారుస్తాం

అనంతగిరి (అన్నపూర్ణ)ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా మారుస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దీనికోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటుగా, పర్యటక మంత్రి తో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆయన పేర్కొన్నారు. నియోజక వర్గంతో పాటుగా ప్రతి మండలం, ప్రతి గ్రామాన్ని, అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడమే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని, గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ సుధా కిరణ్, ఈఈ రమేష్, డి ఈ ఎం ఉపేందర్, స్థానిక సర్పంచ్ అరుకాల నవీన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీపీలు ఉట్కూరు వెంకటరమణారెడ్డి, గుడిసే ఐలయ్య, ఐరెడ్డి మహేందర్ రెడ్డి, పసుల వెంకన్న, ఎలగందుల ప్రసాద్, ఏఈలు సమరసేన, వంశీ, నాగేందర్, ఆయా గ్రామాల నూతన సర్పంచులు, ఉప సర్పంచ్ లు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు , తదితరులు పాల్గొన్నారు.
