
ఫ్యాక్స్ డైరెక్టర్ల నుండి సర్పంచ్ గా జయకేతనం
ఇల్లంతకుంట ✍️Ⓜ️🅰️K న్యూస్: ఇల్లంతకుంటప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (ఫ్యాక్స్) లో డైరెక్టర్లుగా గెలిచి బాధ్యతలు చేపట్టిన ముగ్గురు డైరెక్టర్లు సర్పంచ్ గా గెలుపొంది జయకేతనం ఎగరవేశారు. ఇల్లంతకుంట మండలంలో ని పెద్ద లింగాపూర్ గ్రామానికి చెందిన గన్నారం వసంత నరసయ్యలు ఫ్యాక్స్ డైరెక్టర్ గా హైట్రిక్ విక్టరీ సాధించి మండలంలో తమదైన ముద్ర వేసుకున్నారు. వారితో పాటుగా ఓగులాపూర్ గ్రామానికి చెందిన నాయిని నవీన్ కుమార్ డైరెక్టర్ గెలుపొందారు, అదేవిధంగా వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన చల్ల నవీన్ రెడ్డి డైరెక్టర్ గెలుపొంది బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఇల్లంతకుంట మండలంలో జరిగిన రెండో విడత స్థానిక సంస్థ ల పోరులో ముగ్గురు సర్పంచిగా ఆయా గ్రామాలలో పోటీ చేసి విజయ డంక మోగించారు. ఫ్యాక్స్ లో రైతులకు సేవలు అందించిన వీరిని, ప్రజలు హత్తుకుని సర్పంచ్ గా గెలిపించుకున్నారు. ఒక పదవిలో ఉన్నవారు మరో పదవి పోటీ చేయాలంటే ప్రజల నుండి చాలా వ్యతిరేకత ఎదురవుతుంది. కానీ అవన్నీంటిని తిరగరాసి వీరు విజయం సాధించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నూతన సర్పంచులను సన్మానించిన ఫ్యాక్ట్ చైర్మన్ తిరుపతిరెడ్డి
తమ ఫ్యాక్స్ లో డైరెక్టర్ లు గా విధులు నిర్వహించిన ముగ్గురు డైరెక్టర్లను శాలువాతో సత్కరించి, అభినందించారు ఇల్లంతకుంట ఫ్యాక్స్ చైర్మన్ రోండ్ల తిరుపతిరెడ్డి. తమ ఫ్యాక్స్ లో ఇన్ని సంవత్సరాలుగా డైరెక్టర్ గా సేవలందించిన వారు ,సర్పంచ్ కావడం చాలా అభినందనీయమని తిరుపతిరెడ్డి అభిప్రాయ వ్యక్తం చేశారు.