
వినాయక నవరాత్రి ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, శాంతియుతంగా నిర్వాహకులు జరుపుకోవాలని సిరిసిల్ల రూరల్ సీఐ కోలగాని మొగిలి అన్నారు. జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ఆదేశాల మేరకు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్ లో వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించే నిర్వాహకులతో, యువకులతో ఎస్ఐ సిరిసిల్ల అశోక్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించవద్దని, పోలీస్ శాఖ సూచనలు పాటించి, నవరాత్రి ఉత్సవాలు నిర్వహించు కోవాలన్నారు. డిజె సిస్టం పూర్తిగా నిషేధించబడిందని, మండపానికి సెస్ అధికారుల అనుమతితో విద్యుత్ సరఫరా తీసుకోవాలన్నారు. తప్పనిసరిగా మండపాల నిర్వహకులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ బాల్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రాజేందర్, సత్యనారాయణ, కొమురయ్య, రమణ రెడ్డి, కానిస్టేబుల్ వెల్మ శ్రీకాంత్ రెడ్డి, గంగరాజు, అనిల్ , మండపాల నిర్వహాకులు, యువకులు పాల్గొన్నారు.