
మద్దతు తెలిపిన ఏబివిపి రాష్ట్ర నాయకుడు అక్కెం నాగరాజు
గుంతల రోడ్లు బాగు చేయాలని మాడల్ స్కూల్ విద్యార్థులు, ఏబివిపి నాయకుల ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి రాస్తరోకో చేపట్టారు. ఈసంధర్భంగా ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు అక్కేం నాగరాజు మాట్లాడుతూ మండలం లోని రోడ్లన్ని గుంతల మాయంగా మారి,చినుకు పడితే పొలాలను తలపించే విధంగా మారి ఎక్కడ గుంత ఉందొ కూడా తెలియడం లేదన్నారు. అదేవిదంగా మండలం లోని నారెడ్డిపల్లె, తెనుగువని పల్లె, ఇలా చాలా వరకు చిన్న పల్లల్లో రోడ్లు లేక ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారన్నారు. ఇల్లంతకుంట మండలం లోని పరిసర గ్రామాల నుండి మాడల్ స్కూల్ కి వచ్చే విద్యార్థులు, ప్రతి గ్రామంలో గుంతల రోడ్లు ఉన్నాయని, ఆటో లో రావాలి అంటేనే భయంగా ఉందన్నారు.అనంతారం బిక్క వాగు బ్రిడ్జి, మరియు అనంతారం నుండి రహీంఖాన్ పేట కు వెళ్లే రోడ్డు చాలా పెద్ద పెద్ద గుంతలు పడి ఆటో, బస్ లు వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉందన్నారు. 21-08-2025 రోజున సిరిసిల్ల డిపో కు సంబందించిన ఆర్టీసి బస్ ముందు చక్రాలు ఉడిపోయాయని, పెద్ద ప్రమాదానికి కారణం రోడ్లు బాగా లేకపోవడమేనన్నారు. స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మండల అధికారులు స్పందించి రోడ్లు బాగు చేయకుంటే, రానున్న రోజుల్లో తీవ్ర ఉద్యమాలు చేస్తాం అని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో మాడల్ స్కూల్ విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.