
maknews(ఇల్లంతకుంట) సీసీ కెమెరాల ను ఏర్పాటు చేయడం అభినందనీయమని, సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా దొంగతనాలను, నేరాలను నియంత్రించవచ్చని ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్, సర్పంచ్ మామిడి రాజు లు అన్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో గ్రామానికి చెందిన ముత్యం మల్లయ్య, కుమారుడు ముత్యం ప్రశాంత్ గౌడ్ తన అన్న “ముత్యం వెంకటేశం గౌడ్”(వెంకన్న) జ్ఞాపకార్థం ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై తో పాటుగా స్థానిక సర్పంచ్ మామిడి రాజులు కలిసి సీసీ కెమెరాలు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుతో చాలావరకు నేరాలు నియంత్రించవచ్చని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన ముత్యం ప్రశాంత్ గౌడ్ ను ఎస్ఐ, సర్పంచ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు కొయ్యడ రాజయ్య, వార్డు సభ్యులు అంతటి శ్రీకాంత్ గౌడ్, చేరాల వంశీ, అంతటి రమేష్, కొయ్యడ భాస్కర్, అంతటి బాలయ్య, అంతటి రాజయ్య, బండారి శ్రీనివాస్, అంతటి శ్రీనివాస్, డైమండ్ రాజు, ముంజ భాస్కర్, బండారు దేవయ్య, కొయ్యడ చందు, బండారి పరుశురాములు తదితరులు పాల్గొన్నారు.

runfunc: 0; algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:0.0000,0.0000;
brp_del_sen:0.0000,0.0000;
motionR: 1;
delta:1;
bokeh:1;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 13107200;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 125.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 3;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 46;