
✍️Ⓜ️🅰️K NEWS
- గ్రామానికి లైన్స్ క్లబ్, రైతు సంఘం కలిసి బాడీ ఫ్రీజర్ వితరణ
- గ్రామస్తులకు బిపి, షుగర్ పరీక్షలతో పాటు 70 వేల మందులు పంపిణీ
- 20 మంది వృద్దులకు చేతి కర్రలు అందజేత
- ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలో లైన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ స్మార్ట్ సిటీ ఆధ్వర్యంలో ఆరోగ్య శిభిరం నిర్వంచడం జరిగింది. ఆదివారం గ్రామంలోని స్థానిక రైతు సంఘం ఆవరణలో డాక్టర్ సుధాకర్ రెడ్డి చేత రోగులకు బిపి, షుగర్ పరీక్షలు నిర్వహించి 70 వేల రూపాయల మందులు ఉచితంగా ఇవ్వడం జరిగింది. లైన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ స్మార్ట్ సిటీ ఆధ్వర్యంలో రేపాక లో ఆరోగ్య శిబిరం. లైన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ స్మార్ట్ సిటీ మరియు రేపాక రైతు సంఘం సంయుక్తంగా రేపాక గ్రామానికి 60 వేల రూపాయల విలువ గల బాడీ ఫ్రీజర్ అందజేయడం జరిగింది.అదేవిధంగా 20 మంది వృద్దులకు చే తి కర్రలు ఉచితంగా అందజేయడం జరిగింది. ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టడానికై మందులతో పాటు ప్రతి ఒక్కరికి బట్ట సంచులు అందజేయడం జరిగింది. అదే విధంగా మధుమేహ వ్యాధి అవగాహనకై కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్బంగా లైన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ స్మార్ట్ సిటీ మైక్రో క్యాబినెట్ సభ్యులు వెంకటరమణరెడ్డి, పుల్లూరి ప్రభాకర్ లు మాట్లాడుతూ సమాజ సేవే లక్ష్యంగా ప్రతి గ్రామంలో సేవ చేయాలానే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ప్రజల నుండి మంచి స్పందన వచ్చిందన్నారు. అదేవిధంగా బాడీ ఫ్రీజర్ గ్రామానికి అందజేయడంలో మాతో కలిసి సహకరించిన రేపాక గ్రామ రైతు సంఘం సభ్యులకు వారు లైన్స్ క్లబ్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా గ్రామ రైతు సంఘం ప్రతినిధులు రొండ్ల మల్లారెడ్డి, నర్ర భూంరెడ్డి లను వారు శాలువా తో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇదే గ్రామానికి చెందిన లైన్స్ క్లబ్ స్మార్ట్ సిటీ కరీంనగర్ అధ్యక్షులు పాత కిరణకుమార్, ఎఫ్ డబ్ల్యూ సి బి. సరళ, రీజనల్ మెంబర్ సంపత్ కుమారి,రేపాక గ్రామానికి చెందిన మరియు లైన్స్ క్లబ్ సెక్రటరీ రొండ్ల ప్రభాకర్ రెడ్డి, లైన్స్ క్లబ్ ట్రెజరర్ నాగశేషు, క్లబ్ మెంబర్ సదా శివారెడ్డి, రొండ్ల రాంరెడ్డి, రొండ్ల భూపతి రెడ్డి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.