
maknews–
-16 రోజుల పాటు దీక్ష చేపట్టిన ప్రభుత్వం
పట్టించుకోలేదని ఆవేదన
-కాల్వ నిర్మాణ పనుల “నిధుల కోసం” రైతుల బిక్షాటన ఇల్లంతకుంట లో
ఎల్ ఎం-6 కాలువ నిర్మాణం చేపట్టాలని ఇల్లంతకుంట మండలంలోని పెద్ద లింగాపూర్ సమీపం లో 12 గ్రామాల రైతులు చేపట్టిన దీక్ష ను ప్రభుత్వం, పాలక పక్షం,అధికారులు పట్టించుకోలేదంటూ నిరసన తో రైతులు ఇల్లంతకుంట మండల కేంద్రంలో బిక్షాటన చేపట్టారు. 11/6 కాలువ పనులు చేపట్టాలని గత 16 రోజులుగా 12 గ్రామాల రైతులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అయితే ప్రభుత్వం నుండి కానీ, అధికారుల నుండి కానీ ఎలాంటి సానుకూల హామీ రాకపోవడంతో, రైతులు ఇల్లంతకుంట మండల కేంద్రంలో దుకాణాలు, ఇంటింటా, కార్యాలయాలు తిరుగుతూ మెడలో జోలె వేసుకొని బిక్షాటన చేపట్టారు. బిక్షాటన చేసిన డబ్బులతో కాల్వ పనులు పూర్తి చేస్తామని రైతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 100 మంది రైతులు పాల్గొన్నారు.