
కేంద్రం హోం శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ పై పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని నిరసిస్తూ,
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మహేష్ కుమార్ గౌడ్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షుడు భూమల్ల అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్నది జనహిత యాత్ర కాదు పిచ్చి యాత్ర అని , కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ ను ఖతం చేసే యాత్ర అని స్పష్టం చేశారు. జగిత్యాల, చొప్పదండి, కరీంనగర్ లో దొంగ ఓట్లు వేయడం వల్లే బండి సంజయ్ గెలిచారని చెప్పడమంటే కరీంనగర్ ఉమ్మడి ప్రజలను దొంగలని చెప్పడమే అన్నారు. ఉమ్మడి కరీంనగర్ ప్రజలను అవమానించిన మహేష్ గౌడ్ తక్షణమే కరీంనగర్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు.బండి సంజయ్ బీసీ కాబట్టే బిజెపి అధ్యక్ష పదవి నుండి తీసివేశారని మహేష్ గౌడ్ గతంలో చెప్పిండు.. ఇప్పుడేమో బండి సంజయ్ దేశ్ ముక్, దొర అని మాట మార్చు మాట్లాడుతున్నాడు అన్నారు. మహేష్ గౌడ్ ను ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలనిపొద్దున్నే లేస్తే కరీంనగర్ ప్రజలకు ఏం చేయాలని తపించే కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ అని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు తూట్లు పొడిచి కరీంనగర్ ప్రజలకు వెన్నుపోటు పొడిచిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి నిధులు తీసుకొచ్చిన ఘనత బండి సంజయ్ దే అన్నారు.మరి కాంగ్రెస్ పార్టీ ఈ 20 నెలల పాలనలో ఒక్క గ్రామపంచాయతీకైనా నయా పైసా అయినా ఇచ్చింద, దేశంలో 20 నెలల్లో గ్రామ పంచాయతీలకు ఒక్క పైసా ఇయ్యని ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ నని, బండి సంజయ్ పై, బిజెపి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు నాగ సముద్రాల సంతోష్, రాష్ట్ర నాయకులు మేకల మల్లేశం, జిల్లా నాయకులు మామిడి హరీష్ , బూత్ అధ్యక్షులు తుమ్మనపల్లి కమలాకర్ రావు, క్రియాశీల సభ్యులు పినికాసి అనిల్, ఎగుర్ల శ్రీనివాస్, ఆంజనేయులు పాల్గొన్నారు.