✍️Ⓜ️🅰️K NEWS(పెద్దలింగాపూర్)

ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ గ్రామంలో విద్యుత్ షాక్ తో రెండు గొర్రెలు మృత్యువాత పడ్డాయి. గ్రామానికి చెందిన ఎద్దు నర్సయ్య అనే గొర్ల కాపరి,తన గొర్రెలను మేతకు తీసుకువెళ్లి ఇంటికి వస్తుండగా రోడ్డుపై ఉన్న స్ట్రీట్ లైట్ పోల్ కు ఉన్న సపోర్ట్ వైర్ ఒక్కసారిగా విద్యుత్ షాక్ రావడంతో, రెండు గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. గొర్రెలను తీసుకొని వస్తున్న గుర్ల కాపరి ఒక్కసారిగా కేకలు వేయడంతో స్థానికులు , అధికారులకు సమాచారం అందించి, కరెంటు తీసివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
