
ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట గ్రామంలోని తెలంగాణ ఆధర్శ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరానికి (2025_26) మిగిలిన సీట్ల భర్తకి విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రిన్సిపాల్ జి. గంగాధర్ తెలిపారు. 6వ తరగతిలో-09, 8వ తరగతిలో–06, 9వ తరగతిలో-02, 10వ తరగతిలో-05, MPC-మొదటి సంవత్సరం- 11, బైపిసి మొదటి సంవత్సరం-10, సీఈసీ మొదటి సంవత్సరం-03 సీట్లు ఖాళీ ఉన్నట్లు తెలిపారు.ఈ నెల 29 వ తేది వరకు పాఠశాల కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు.