
✍️Ⓜ️🅰️K NEWS by marupaka anil kumar
లైంగిక వేధింపులు భరించలేక.. తనువు చాలించిన బాలిక
-సూసైడ్ నోట్ లో ఆ ముగ్గురే కారణమంటూ లేక
-శారీరకంగా వాడుకొని వీడియోలు తీసారని ఆవేదన..
-తండ్రికి చెప్పు లేక తల్లికి దూరంగా ఉంటూ మానసిక శోభతో మృతి
-వెలుగులోకి వచ్చిన బాలిక మృతి సంచలనం
మనతెలంగాణ/ఇల్లంతకుంట
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రంగంపేట గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక మృతి సంచలనం రేపింది. గత నాలుగు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోలేక ఇంట్లో ఉండి ఫిట్స్ రావడంతో తండ్రి సోమవారం రోజున ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ వైద్యులు బాలిక పరిస్థితి విషమంగా ఉందని పెద్ద ఆసుపత్రికి తరలించాలని తెలపడంతో సిరిసిల్లకు తీర్చికెళ్లారు. అక్కడి తీసుకు వెళ్లడంతో మృత్యువుతో పోరాడి బాలిక మృతి చెందింది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చరిలో బాలికమృతదేహాన్ని సోమవారం భద్రపరిచారు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. తన కూతురు మరణానికి గాలి పెల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు పిల్లి వినోద్, జాషు అదే విధంగా రంగపేట గ్రామానికి చెందిన సందవేని సతీష్ యువకుడు కారణమంటూ పోలీసులకు తెలిపారు. వీటికి సంబంధించిన బాలిక బాధపడుతూ కొన్ని రోజుల క్రితం రాసుకున్న మూడు పేజీలకు పైగా మరణ వాంగ్మూల లేఖను పోలీసులకు అందజేశారు. తన కూతురును ముగ్గురు యువకులు శారీరకంగా వాడుకొని,ఆశ్లీల వీడియోలు చిత్రీకరించి మానసికంగా శోభకు గురి చేశారని ,దీంతో వారి వేధింపులు తాలలేక ఎవరికి, చెప్పుకోలేక దీనస్థితిలో ఇంట్లో ఉండి వ్యక్తి వెక్కివెక్కి ఎడ్చుకుంటూ చివరకు అనారోగ్యం పాలై, పస్తులుండి మృతి చెందిందని వారు తెలిపారు.
వేరుగా ఉంటున్న బాలిక తల్లిదండ్రులు
మృతి చెందిన బాలిక తల్లిదండ్రులు గత రెండు సంవత్సరాల నుంచి వేరుగా ఉంటున్నారు. వీరిద్దరి మధ్యన మనస్పర్ధలు రావడంతో భార్య తన తల్లి గారి గ్రామమైన శిలాపూర్ లో తన చిన్న కొడుకు తో నివాసం ఉంటుంది. మృతి చెందిన బాలిక తండ్రితో ఉంటుంది. దీంతో ఈ హృదయ విదారక సంఘటన జరగడంతో ఒక్కసారిగా విషాద ఛాయలు నెలకొన్నాయి.
తండ్రి నోరు విప్పడంతోనే నమ్మలేని నిజాలు
మొదటగా అందరూ బాలిక తీవ్ర జ్వరంతో ఫిట్స్ రావడంతో మృతి చెందిందని భావించారు. కానీ బాలిక తల్లి కి సంబంధించిన కుటుంబ సభ్యులు, ఆసుపత్రికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. అక్కడ ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడారు .బాలిక మృతికి తండ్రే కారణమంటూ, మొదటగా ఆరోపించారు. దీంతో ఒక్కసారిగా బాలిక తండ్రి నోరు విప్పి నా కూతురు చావుకు గాలి పెల్లి గ్రామానికి చెందిన పిల్లి వినోద్, జాషు ,మరియు రంగ పేట గ్రామానికి చెందిన సందెవేళ సతీష్ లే కారణం అంటూ తెలిపారు. వీటికి సంబంధించిన అశ్లీలమైన వీడియోలు, తన మొబైల్ లో పోలీసులకు ,కుటుంబ సభ్యులకు చూపించారు. కత్తితో బెదిరించి, మానసికంగా శారీరకంగా వేధించారని, తండ్రి ఆవేదనతో రోధించాడు.
ఈ విషయం పెద్ద ఎత్తున దుమారం రేపడంతో జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ను బాలిక కుటుంబ సభ్యులు కలిసి, మొరపెట్టుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఎస్పీ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఎస్పీ వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని, బాలిక మృతికి గల కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సంఘటనపై ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బాలిక మృతిని పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.