
✍️Ⓜ️🅰️K NEWS (జంగారెడ్డిపల్లే)
ఇల్లంతకుంట మండలం జంగారెడ్డి పల్లె గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుర్గాదేవి మండప వద్ద సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని, అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఐదవ రోజు అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో అర్చకులు లింగమూర్తి పంతులు, యూత్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.

