
✍️Ⓜ️🅰️K NEWS
రైతు సంక్షేమమే ఇల్లంతకుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ధ్యేయమని ఫాక్స్ చైర్మన్ రోడ్ల తిరుపతిరెడ్డి తెలిపారు. ఇల్లంతకుంట సొసైటీలో లో 8 మంది రైతులకు దీర్ఘకాలిక,కర్షకమిత్ర రుణాలను అందజేశారు. మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన ఓర్పుల నరసయ్య, పెదలింగాపూర్ గ్రామానికి చెందిన మంకాల పోచయ్య, అనంతరం గ్రామానికి చెందిన చొప్పరి సాయిలు, కందికట్కూర్ గ్రామానికి చెందిన జక్కుల శ్రీనివాస్, గొల్లపల్లి గ్రామానికి చెందిన కుడుదుల పర్శరాములు, వెల్జీపూర్ గ్రామానికి చెందిన కుంచెం రాజు, వల్లంపట్ల గ్రామానికి చెందిన పండుగ కళ, పొత్తూరు గ్రామానికి చెందిన రాగటి రాజకుమార్ లకు మొత్తం రూపాయలు 32 లక్షల అందించినట్లు ఆయన తెలిపారు.రుణాలు పొందిన రైతులు సకాలంలో చెల్లించి, సొసైటీ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సి ఓ రవీందర్ రెడ్డి, తో పాటుగా డైరెక్టర్లు చల్ల నవీన్ రెడ్డి, గజ్జల సత్యం, మధుకర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, సురేష్, సాదులరాజేశ్, కొయ్యడప్రమోద్, తదితరులు పాల్గొన్నారు.