
✍️Ⓜ️🅰️K NEWS
రాయికల్ మండలం మంఖ్య నాయక్ తండా ఒడ్డె లింగాపూర్ గ్రామానికి చెందిన గుగ్లావత్ కల్యాణికి పురిటి నొప్పులు రాగా, అత్యవసర వైద్యం కోసం హాస్పిటల్ కి తరలిస్తున్నారు. పెద్ద ఎత్తున రాయికల్ వచ్చే మార్గంలో రామాజీపేట శివారులో బ్రిడ్జి పై నుండి వరద అదికంగా ఉండటం తో ,దాటలేని పరిస్థితులలో రామాజీపేట యువత ఆలోచనతో జెసిబి తెప్పించి ,వారిని బ్రిడ్జి దాటించారు. అక్కడ అప్పటికి అందుబాటులో ఉన్న 108 అంబులెన్సు ద్వారా హాస్పిటల్ కి తరలించారు.కాగా స్థానిక యువత చూపిన చిత్తశుద్ధి, సమయస్ఫూర్తి చూసి స్థానికులు, గ్రామస్థులు వారిని ప్రశంశించారు.