✍️Ⓜ️🅰️K NEWS (దాచారం)

కామారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ గా బాధ్యతలు
ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామానికి చెందిన మింద రవితేజ గ్రూప్ -1 లో సత్తా చాటి 66వ ర్యాంక్ సాధించాడు. గ్రూప్ -1 లో సత్తా చాటడంతో కామారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ గా రవితేజ బాధ్యతలు స్వీకరించునున్నాడు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు. పల్లెటూరు కు చెందిన యువకుడు జిల్లా డిప్యూటీ కలెక్టర్ గా నియామకం పట్ల గ్రామస్తులు, తల్లిదండ్రులు హర్ష వ్యక్తం చేస్తున్నారు. రవితేజ తండ్రి మిందే రాజు ఎల్ఐసి ఏజెంట్ గా విధులు నిర్వహిస్తుంటాడు, తల్లి లక్ష్మి ఉన్నారు.