
-అమ్మవారి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యేమన తెలంగాణ/ఇల్లంతకుంట
దుర్గామాత దీవెనలు ప్రజలందరిపై ఉండాలని ,పంట పొలాలు సుభిక్షంగా పండి, రైతులు ఆనందోత్సవాల్లో దసరా పండుగ నిర్వహించుకోవాలని మానకొండూరు శాసనసభ్యుడు డా. కవంపల్లి సత్యనారాయణ అన్నారు. ఆదివారం మండలంలోని పొత్తూరు, ముస్కాని పేట, ఇల్లంతకుంట, గొల్లపల్లి గ్రామాలలో ఏర్పాటుచేసిన “దుర్గామాత” మండపాలలో ఎమ్మెల్యే పాల్గొని, ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ను మండపాల నిర్వహకులు శాలువాతో ఘనంగా సత్కరించారు.
మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ…
మండలంలోని ఆయా గ్రామాలలో మృతి చెందిన కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపెల్లి సత్యనారాయణ ఆదివారం పరామర్శించారు. ఇల్లంతకుంట గ్రామానికి చెందిన ఒగ్గు లక్ష్మీనారాయణ, గొల్లపల్లి గ్రామానికి చెందిన పున్ని వేణు, వెంకట్రావు పల్లె గ్రామానికి చెందిన సొల్లు బాలయ్య, కందికట్కూరు గ్రామానికి చెందిన తాళ్లపల్లి బాలయ్య లు ఇటివల మృతిచెందారు. వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి, ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీపీ ఉట్కూరి వెంకటరమణారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మామిడి సంజీవ్, పసుల వెంకటి, జిల్లా మహిళ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ తీగల పుష్పలత గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షురాలు వెలిచాల జ్యోతి, కూనబోయిన బాలరాజు, స్పోర్ట్స్ క్లబ్ ప్రెసిడెంట్ మామిడి రాజు ,చిట్టి ప్రదీప్ రెడ్డి,అల్లెపురజనీ కాంత్,కాసుపాకశంకర్,కడగండ్ల తిరుపతి, యాస తిరుపతి, బిగుల్ల విజయ్, దొమ్మాటి సంతోష్, గుంటి మహేష్, బండారి శ్రీనివాస్,శివరాం, నరేష్, మధు, నిఖిల్ ,సొల్లుప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.