
MAKNEWS (జంగారెడ్డిపల్లే) యువత క్రీడల్లో రాణించాలని జంగారెడ్డి పల్లె గ్రామ సర్పంచ్ పండుగ సునీత తిరుపతి లు అన్నారు. జంగారెడ్డి పల్లె గ్రామంలోని క్రికెట్ క్రీడాకారులకు,గ్రామ ఉప సర్పంచ్ మల్లామారి శ్రీనివాస్ జేర్సి ల టీ షర్టులనును అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ పండుగ సునిత తిరుపతి మాట్లాడుతూ యువత మంచి మార్గాన్ని ఎంచుకుని ముందుకు వెళ్లాలని సమాజ సేవలో కూడా యువత తమ వంతు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. క్రీడా పోటీల్లో క్రికెట్ జట్టు గెలిచి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సర్పంచ్ సునీత తిరుపతి పేర్కొన్నారు. యువత కోసం జెర్సీలోను అందజేసిన ఉపసర్పంచ్ మల్లమారి శ్రీనివాసులు సర్పంచ్ తో పాటుగా గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మంద పెద్ద బాల్ రెడ్డి,తూంకుంట రామలింగారెడ్డి,మంద సత్తిరెడ్డి, మారుపాక తిరుపతి, పసుపునుటి రవి,తడుకపెల్లి తిరుపతి, పండుగ రమేష్, తడుకపెల్లినర్సింహులు,కుమ్మరవేని యాదగిరి,పండుగ కనుకచంద్రం,
పండుగ అర్జున్,మల్లామారి రాజు తదితరులు మరియు గ్రామ యువకులు పాల్గొన్నారు.