
సమ్మక్క సారలమ్మ దీవెనలు ప్రజలందరిపై ఉండాలని, పంట పొలాలు సుభిక్షంగా పండాలని ఆ వన దేవతలను కోరుకున్నట్లు మానకొండూరు నియోజకవర్గం శాసన సభ్యుడు, ప్రదేశ్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. గురువారం ఇల్లంతకుంట మండల కేంద్రంలోని “సమ్మక్క సారలమ్మ జాతర” మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ‘సమ్మక్క సారలమ్మకు’ ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే తన ఎత్తు బంగారాన్ని సమ్మక్క సారలమ్మకు సమర్పించారు. ఈ సందర్భంగా సమ్మక్క సారలమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు శాలువాతో సత్కరించి సన్మానం చేశారు. సమ్మక్క సారలమ్మ ఆలయానికి అన్ని విధాలుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీపీ ఉట్కూరు వెంకటరమణారెడ్డి, ఇల్లంతకుంట సర్పంచ్ మామిడి రాజు, ఐరెడ్డి మహేందర్ రెడ్డి, ఈదుల రవీందర్ రెడ్డి, ఈదుల రాజిరెడ్డి ,వజ్జాపెళ్లి మల్లేశం, దెయ్యాల కనకయ్య, రామకృష్ణ, మామిడి నరేష్ ,తో పాటుగా తదితరులు పాల్గొన్నారు.
