
-రూ.100 నుండి 150 కిలో వరకు బంతిపూల విక్రయం
maknews(ఇల్లంతకుంట)
సద్దుల బతుకమ్మ పండుగ గోలే.. బంతిపూలకు భలే గిరాకీ నెలకొంది. ఒకప్పుడు సద్దుల బతుకమ్మ వచ్చిందంటే రెండు ఓద్దుల ముందు.. వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లి, లేదా అడవిలోకి వెళ్లి తంగేడు పువ్వు, గునుగు పువ్వు, తీరోక్క పూలతో కలిపి, బంతిపూలను తెచ్చుకునే వాళ్లు. కానీ ఇప్పుడు పూర్తిగా అప్పటి పరిస్థితికి భిన్నంగా నెలకొంది. ఇల్లంతకుంట బస్టాండ్ లో పెద్ద ఎత్తున బంతిపూలు, గునుగు పువ్వు, తంగేడి పువ్వు, చామంతి పూలతో పాటుగా, పలు రకాల పువ్వుల విక్రయాలు జరిగాయి. పెద్ద ఎత్తున మహిళలు బంతిపూలను కొనేందుకు ఉదయాన్నే బస్టాండ్ లో ,మార్కెట్లోకి చేరుకున్నారు. ఇల్లంతకుంట మండలంలో సోమవారం సద్దుల బతుకమ్మ పండుగ జరగనుంది.