
maknews…..ఇల్లంతకుంట మండల కేంద్రంతో పాటుగా ,అన్ని గ్రామాలలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయా గ్రామాలలో ప్రధాన కూడలితో పాటుగా, వాడలలో బతుకమ్మలను ఏర్పాటు చేశారు. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మను, మధ్యలో ఉంచి, రామ రామ ఉయ్యాలో రామనేసి రామ ఉయ్యాలో… అంటూ పాటలు పాడుతూ బతుకమ్మ ఆటను ఆడారు.

అనంతరం తీరోక్క పూలతో పేర్చిన బతుకమ్మను నెత్తిపై ఎత్తుకొని డప్పు చప్పుల నడుమ బతుకమ్మ తెప్పల వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన విద్యుత్ కాంతుల వెలుగుల్లో డీజే సిస్టంలో బతుకమ్మ పాటలతో హోరెత్తించారు. అనంతరం వాగులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. మహిళలు వాయినాలను ఇచ్చి పుచ్చుకొని, సత్తిపిండిని పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు అధికారులు పాల్గొన్నారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గస్తీ ఏర్పాటు చేశారు.
