
144 సెక్షన్ తో మా ఉపాధికి నష్టం
-తహాసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన వర్తక వ్యాపారులు
✍️Ⓜ️🅰️K NEWS (ఇల్లంతకుంట)
స్థానిక సంస్థల ఎన్నికల భాగంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం సమీపంలో 144 సెక్షన్ అమలులో ఉండడంతో వర్తక వ్యాపారులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. సర్పంచ్ ,వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ కేంద్రం సమీపంలో 144 సెక్షన్ ఉండడంతో దుకాణ సముదాయాలను, మూసి, వేయాలని నిబంధన ఉంది. దీంతో నిబంధనను పాటించాలని ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ వ్యాపారులకు తెలియజేశారు. దుకాణాలు మూసి వేస్తే మాకు ఉపాధి నష్టం కలుగుతుందని, దీంతో చాలా ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటామని దుకాణ యజమానులు తెలియజేశారు. అనంతరం బస్టాండ్ ఆవరణలోని దుకాణ సముదాయాల యజమానులు, వ్యాపారులు తహాశీల్దార్ ఎంఎ ఫారుక్ వద్దకు వెళ్లి వారి యొక్క సమస్యను వివరించారు. దీంతో తహశీల్దార్ స్పందిస్తూ జిల్లా రెవెన్యూ అధికారితో పూర్తిస్థాయిలో మాట్లాడి, చెప్తానని అప్పటివరకు దుకాణాలు మూసి వేసుకోవాలని తెలిపారు. కొంతమంది చిరు వ్యాపారులు దుకాణాలను సగం మాత్రమే తీసుకొని ఉన్నారు.