
✍️Ⓜ️🅰️K news
ఇల్లంతకుంట పట్టణ గౌడ సంఘం యూత్ అధ్యక్షునిగా పంజాల సతీష్ గౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు.ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ఎల్లమ్మ గుడి ఆవరణలో జరిగిన గౌడ సంఘం యూత్ సమావేశంలో కొత్త కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పంజాల సతీష్ ను గౌడ సంఘం యూత్ అధ్యక్షుడిగా, ముత్యం ప్రశాంత్ ను ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.సంఘం అభివృద్ధి, యువత ఐక్యత, సామాజిక సేవ కార్యక్రమాలకు తాము కృషి చేస్తామని నూతన అధ్యక్షుడు పంజాల సతీష్ తెలిపారు. కార్యక్రమంలో గౌడ సంఘ పెద్దలు, యువత, పాల్గొన్నారు.