
✍️Ⓜ️🅰️K NEWS
రైతుకు అప్లికేషన్ ఫామ్ ఇవ్వని దుస్థితిలో సింగిల్ విండో సొసైటీ
పేరు గొప్పలు… రైతు తిప్పలు పట్టవు
జిల్లాలో మొదటి స్థానం, రాష్ట్రంలో అగ్రస్థానానికి పరిగెడుతున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న ఇల్లంతకుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఫ్యాక్స్ రైతులకు కనీసం దరఖాస్తు ఫామ్ ఇవ్వడంలో చిన్న చూపు చూస్తుంది.. కోట్ల రూపాయల రుణాలను రైతులకు అందించామని గొప్పలు చెప్పుకుంటూ, వడ్జీలను ముక్కుపిండి వసూలు చేస్తున్న సొసైటీ.. కనీసం రైతు రుణం కోసం వచ్చిన రైతులకు దరఖాస్తు ఫామ్ కూడా ఉచితంగా అందివ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయు. పంట రుణం కోసం దరఖాస్తు చేసుకునేందుకు దరఖాస్తు ఫామ్ సోసైటిలో లేకపోవడంతో, ఇల్లంతకుంట మండల కేంద్రంలోని జిరాక్స్ సెంటర్లను రైతులు ఆశ్రయిస్తున్నారు. అక్కడ డబ్బులు చెల్లించి దరఖాస్తు ఫాములు తీసుకోవడం చాలా భాదగా ఉందని వ్యవసాయ కార్మీకశాఖ జిల్లా కార్యదర్శి గన్నారం నర్సయ్య ఆరోపించారు. రైతులకు ఉచితంగా ధరఖాస్తు ఫామ్ లు , రైతులకు మెరుగైన వసతులను కల్పించాలన్నారు.