
✍️Ⓜ️🅰️K NEWS / ఇల్లంతకుంట
ఇల్లంతకుంట మండలం రహీంఖాంపేట గ్రామంలోని గ్రామపంచాయతీ సిబ్బందికి గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ గడ్డమీద శ్రీనివాస్ దుస్తులను అందజేశారు. దసరా, బతుకమ్మ పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులను అందించినట్టు ఆయన పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలను అందించాలని వారిని గుర్తించవలసిన అవసరం అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు బత్తిని మల్లయ్య , బత్తిని నారా గౌడ్, బత్తిని పరశురాములు, గడ్డమీది వీర గౌడ్, చుక్క రమేష్, అంతగిరి శ్రీనివాస్, నార్ల శ్రీనివాస్, కిట్టు, ప్రశాంత్ తో పాటుగా తదితరులు పాల్గొన్నారు.