
MAKNEWS ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించబోయే సద్దుల బతుకమ్మ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు, ఇల్లంతకుంట సర్పంచ్ మామిడి రాజు తెలిపారు. మండల కేంద్రంలోని బతుకమ్మ తెప్ప వద్ద విద్యుత్ బల్బులను ఏర్పాటు చేయడంతో పాటుగా, మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిసర ప్రాంతాలను మొత్తం చదును చేపించి, రంగులను వేయడం జరిగిందన్నారు. అదేవిధంగా చింతల కుంట పల్లే వెళ్లే మార్గంలో ఎర్రకుంట వద్ద విద్యుత్ వెలుగులను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మహిళలకు ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా ప్రధాన రహదారుల గుండా ప్రత్యేక ఎల్ ఈడి లైట్లతో పాటుగా, సిరీస్ లైట్లను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మూగు నాగరాజు శర్మ, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, వార్డు సభ్యులు, సిబ్బంది మామిడి నర్సయ్య, ఎలుక రాము, తదితరులు పాల్గొన్నారు.