
ఇల్లంతకుంట /✍️Ⓜ️🅰️K NEWS
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గూడెపల్లి గ్రామ సర్పంచ్ గా నూతనంగా గెలిచిన గూడెల్లి స్వప్న భాస్కర్ లు బుధవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నూతనంగా ,బిజెపి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గూడెల్లి స్వప్న భాస్కర్ ను శాలువాతో సత్కరించి సన్మానించారు. గూడెపల్లి గ్రామపంచాయతీ అభివృద్ధి కోసం తనవంతుగా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. బిజెపి బలపరిచిన అభ్యర్థులకు ఆయన తన నిధులనుండి రూపాయలు 10 లక్షలు కేటాయిస్తానన్న విషయం తెలిసినదే.