
MAKNEWS ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల లోని కరీంనగర్ డైరీ పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడిగా నాయిని మల్లేశం గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాపై నమ్మకంతో మరోసారి పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడిగా నియ మించినందుకు, సంఘ సభ్యులకు, సంస్థ డైరెక్టర్లకు, పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ డైరీ ఇల్లంతకుంట మండల సూపర్వైజర్లు సిహెచ్ వెంకట్రామిరెడ్డి, పాలకవర్గ సభ్యులు, పాల ఉత్పత్తిదారులు పాల్గొన్నారు.