
బిపిఎం సింగిరెడ్డి నరసింహారెడ్డి ఘనంగా పదవీ విరమణ సమావేశం*
ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ సహజమని, ఉద్యోగి పదవిలో చేరిన నాటి నుండి పదవి విరమణ పొందేంతవరకు ప్రతిరోజు శ్రమిస్తూ ఉంటాడని, ఇల్లంతకుంట మాజీ ఎంపీపీలు ఉట్కూరు వెంకటరమణారెడ్డి ,గుడిసె ఐలయ్య లు అన్నారు. ఇల్లంతకుంట మండలం ముస్కాని పేట గ్రామానికి చెందిన పోస్ట్ ఆఫీస్ ఉద్యోగి బిపిఎం సింగిరెడ్డి నరసింహారెడ్డి పదవీ విరమణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి పదవి విరమణ పొందుతున్న సింగిరెడ్డి నరసింహారెడ్డి ని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ వెన్నమనేని జగన్మోహన్ రావు, మాజీ డైరెక్టర్ కోమటిరెడ్డి చిన్న నరసింహారెడ్డి,తో పాటుగా ఫోస్టాఫిస్ అధికారులు, సిబ్బంది, నాయకులు, ముస్కానిపేట గ్రామస్థులు పాల్గొన్నారు.