
✍️Ⓜ️🅰️K ప్రముఖ పుణ్యక్షేత్రం రామోజీపేట గ్రామం లో ని శ్రీ సీతా రామచంద్రస్వామి ఆలయంలో ఈనెల 4వ తేదీన ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు శ్రీ రుక్మభట్ల సీతారామ శర్మ తెలిపారు. శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో పుష్య బహుళ పాడ్యమి ఆదివారం రోజున ‘లక్ష పుష్పార్చన’ కార్యక్రమంతో పాటుగా శ్రీ సీతారాములవారికి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు పేర్కొన్నారు. లక్ష పుష్పార్చన కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు తరలిరావాలని ఆలయ అర్చకులు సీతా రామ శర్మ, రామ్ చరణ్ శర్మ తెలిపారు.