
MAKNEWS
మండలంలో రైతులకు సేవలందించిన మండల వ్యవసాయ శాఖ అధికారి (MAO) సురేష్ రెడ్డి కి ఘన సన్మాణం చేశారు. పొత్తూరు గ్రామంలో రైతులు, డీలర్ల ఆధ్వర్యంలో బదీలిపై వెళ్తున్న సురేష్ రెడ్డి కి సన్మాణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సంధర్భంగా మఖ్య అథితిగా మాజీ ఎంపిపి వుట్కూరి వెంకట రమణా రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఫ్యాక్స్ చైర్మన్ రోండ్ల తిరుపతి రెడ్డి, మాజీ సర్పంచ్ కట్ట వెంకట్ రెడ్డి లు, డీలర్స్ అసోసియేషన్ ఉప్పల వేణు, మామిడి రాములు హాజరై ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీలర్స్, రైతులు పాల్గొన్నారు. ఎఓ తన స్వంత రాష్ర్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ని కర్నూలు జిల్లా నంధ్యాలకు కు బదిలీపై వెళ్తున్నారు.