
MAKNEWS (వల్లంపట్ల) గ్రామం లో మహిళా సంఘాలకు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి భవనం లేనందున, గ్రామ పంచాయతీ సర్పంచ్, పాలక వర్గం, మహిళా సంఘాల సభ్యుల కోరిక మేరకు స్వర్గీయ కట్ట సత్యనారాయణ రెడ్డి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు 2గుంట భూమిని విరాళంగా అందజేశారు. వారి కటుంబ సభ్యులు సంపూర్ణ, కట్ట సౌమ్య శ్రీకాంత్ రెడ్డి, రుత్విక్ రెడ్డి రెండు గుంటల భూమిని గ్రామ పంచాయతీ కి మహిళ సంఘ భవనం కోసం విరాళంగా అందజేశారు. ఈ సంధర్భంగా సర్పంచ్ నేరెళ్ళ విజయ్ మాట్లాడుతు భూమిని విరాళంగా ఇవ్వండం అభినందనీయమన్నారు. వారికి శాలువాతో సత్కరించి,సన్మాణం చేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తిరుపతి, ఉపసర్పంచ్ వంశీ, నరేందర్,సులోచన,రుచిత,కళ,వెన్నెల, అశోక్,శేఖర్, మధు, నాగరాజు, గ్రామస్తులు పాల్గొన్నారు