
అండర్ 19 బీ టీం కెప్టెన్ గా కట్ట శ్రీవల్లి రెడ్డి-హర్షం వ్యక్తం చేస్తున్న మండల ప్రజలు ✍️Ⓜ️🅰️K
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అండర్ 19 బి టీం కెప్టెన్ గా ఇల్లంతకుంట మండలం వంతడ్పుల గ్రామానికి చెందిన కట్ట శ్రీవల్లి ఎంపిక కావడం పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులు గా క్రికెట్ లో రాణిస్తున్న శ్రీవల్లికి అరుదైన గౌరవం దక్కడం పట్ల గ్రామస్తుల తో పాటుగా మండల ప్రజలు ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చండీగఢ్ రాష్ట్రంలో ఫిబ్రవరి నెల 2 నుండి 10 వరకు జరగబోయే క్రికెట్ మ్యాచ్ షెడ్యూల్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అండర్ 19 బి టీం ను ఎంపిక చేశారు. మొదటగా 15 మంది క్రీడాకారులను ఎంపిక చేయగా, స్టాండ్ బై లో మరో ఐదుగురిని ఎంపిక చేశారు. మొత్తం 20 మహిళల జట్టును సెలక్షన్ కమిటీ ఛైర్మన్ మరియు సెలెక్టర్లు సమావేశమై ఎంపిక చేశారు. వీరిలో వంతడుపుల గ్రామానికి చెందిన కట్ట లక్ష్మారెడ్డి ఉమారాణి దంపతుల కుమార్తె కట్ట శ్రీవల్లి ని జట్టు కెప్టెన్ గా సెలెక్టర్లు ఎంపిక చేయడం జరిగింది. ఈ మేరకు హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ జట్టుతో కూడిన జాబితాను విడుదల చేసింది.