
ఇల్లంతకుంట మండలంలో వరుస పెట్టి ఆలయాలలో చోరీలు జరుగుతుండటంతో గ్రామస్తులు అప్రమత్త మయ్యారు. మండలంలోని వల్లంపట్ల గ్రామంలో పెద్దమ్మ ఆలయంలో ముదిరాజ్ కులస్తులు దొంగతనాలను నివారించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాలు గ్రామ పోలీసు అధికారి, హెడ్ కానిస్టేబుల్ రమణారెడ్డి నేతృత్వంలో ఆలయంలో ముదిరాజ్ కులస్తులు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక ఆలయం వద్ద, గ్రామ కూడలి ల వద్ద తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని హెడ్ కానిస్టేబుల్ రమణారెడ్డి పేర్కొన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను, దొంగ తనాలను నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కులస్తులు కర్ల లక్ష్మణ్, బోయిన రంజిత్, లింగు చంద్రమౌళి ,సందవేని సురేష్, సంధవేని రాజశేఖర్, కర్ల తిరుపతి ,జంగిటి రమేష్, కర్ల లక్ష్మణ్ ,కర్ల కనకయ్య, జంగిటి రాజు ,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.