
maknews /ఇల్లంతకుంట
గర్భిణీ స్త్రీలు, బాలింతలు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని ఇల్లంతకుంట సర్పంచ్ మామిడి రాజు పేర్కొన్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని అంగన్వాడి కేంద్రంలో సూపర్వైజర్ చంద్రకళ ఆధ్వర్యంలో ఆరోగ్య లక్ష్మి పథకం పై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోషకాహార విలువలపై సూపర్వైజర్ చంద్రకళ వివరించారు. గర్భిణీ స్త్రీలు ,బాలింతలు ఆకు కూరలను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. వీటితో పాటుగా పాలు ,పోషక విలువలతో కూడిన చేపలు ,కోడిగుడ్లను రోజు వారిగా తీసుకుంటే ఆరోగ్యవంతంగా ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ ,వార్డు సభ్యులు అంతటి శ్రీకాంత్, శ్రీలత ,లావణ్య ,అంగన్వాడి టీచర్లు ఒగ్గు విజయలక్ష్మి ,మామిడి వందన, గొర్రె లక్ష్మి ,తదితరులు పాల్గొన్నారు.