
maknews/ పోషక విలువలతో కూడిన ఆహారాన్ని గర్భిణీ స్త్రీలు, బాలింతలు తీసుకోవాలని ఇల్లంతకుంట సర్పంచ్ ‘మామిడి రాజు’ పేర్కొన్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బీసీ కాలనీలోని అంగన్వాడి కేంద్రంలో (ఏ ఎల్ ఎం ఎస్ సి) అంగన్వాడి లెవెల్ మానిటరింగ్ అండ్ సపోర్ట్ కమిటీ ఏర్పాటు కోసం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. 3 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలను తప్పనిసరిగా అంగన్వాడికి పంపించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మూగు నాగరాజు శర్మ, కార్యదర్శి చంద్రశేఖర్ ,వార్డు సభ్యులు ఎర్రోజు దీపిక రవితేజ, రాకం సుమన్ ,అంతటి శ్రీకాంత్, మామిడి సుశీల, అంగన్వాడి టీచర్ బైరి అరుణ, రహీం మునిసా, అంతగిరి సరస్వతి, కాసు పాక రాణి, మామిడి వందన, నార్ల దినేష్, నాగపురి బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.