maknews

జాతీయ స్థాయి తెలంగాణ యూత్ వాలీబాల్ టీం అసిస్టెంట్ కోచ్ గా రాజశేఖర్ ను నియమించారు. మార్చి15 నుండి 20 వరకు ఒడిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్ లో జరిగే యూత్ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు తెలంగాణ రాష్ట్ర బాలుర జట్టుకు ఇల్లంతకుంటకు చెందిన ముస్తాబాద్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న చేరాల రాజశేఖర్ అసిస్టెంట్ కోచ్ గా ఎంపికైనదుకు గ్రామస్తులు అభినందించారు. తనను రాష్ట్ర జట్టుకు కోచ్ అసిస్టెంట్ కోచ్ గా ఎంపిక చేసినందుకు తెలంగాణ రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ కు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అసోసియేషన్ కార్యదర్శి గిన్నె లక్ష్మణ్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు చెన్నమనేని శ్రీకుమార్, DYSO రాందాస్ గారికి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సాన బాబు ఇల్లంతకుంట, VBA సిరిసిల్ల సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపాడు