
maknews కన్నుల పండువగా, అంగరంగ వైభవోపేతంగా ‘శ్రీ సీతారామ శివాంజనేయ దేవస్థానంలో’ నూతన ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ పురోహితుల నేతృత్వంలో , సర్పంచ్ వోల్లాల రజిత వెంకటేశం గౌడ్ ఆధ్వర్యంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన వేడుకలను ఘనంగా ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన అనుపురం రంగాచారి, అనుపురం ఎంకమ్మ జ్ఞాపకార్థం, వారి కుమారులు అనుపురం విశ్వరూప చారి అరుణ, అనుపురం భాస్కరాచారి సురేఖ , అనుపురం షణ్ముఖ చారి అనిత ,అనుపురం అశోక చారి వందనాలు, కలిసి ధ్వజస్తంభాన్ని విరాళంగా అందజేశారు. వేద పండితులు చెరుకు పవన్ శర్మ, శేషం మురళీ మోహన చార్యులు, శ్రీ హర్ష ,శ్రీ చక్ర ఆధ్వర్యంలో ప్రతిష్టాపన వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళలు, హనుమాన్ మాలాధారణ స్వాములు, తదితరులు పాల్గొన్నారు.