
MAKNEWS
-ఊరురా రాములోరి లగ్గం
సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి ఆలయంతో పాటుగా, గంగాధర క్షేత్రంలో అంగరంగ వైభవ వోపేతంగా, కన్నుల పండుగగా, నిర్వహించారు. అదేవిధంగా ఎంతో ప్రసిద్దిగాంచిన రామోజీపేట శ్రీ సీతరాముల కల్యాణం..భక్తజన సందోహంతో కిక్కిరిసింది. జంగారెడ్డి పల్లే శ్రీ రామలింగేశ్వర ఆలయంలో, రేపాక రామాలయం, గాలిపెల్లి శివాలయం,వల్లంపట్ల, కేశన్నపెల్లే, వెల్జీపూర్, వెంకట్రావ్ పల్లే, అనంతారం తో పాటు పలు ఆలయాల్లో రాములోరి లగ్గం ఘనంగా జరిగింది. వేద పండితులు, వేద మంత్రాల సాక్షిగా సీతారాముల కళ్యాణ మహోత్సవం, జనసందోహం నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు ఆలయంలో ఆసీను లయ్యారు. కళ్యాణ మహోత్సవం అనంతరం, భక్తులందరికీ ముత్యాల తలంబ్రాలను, ఆలయ వ్యవస్థాపకులు మూగు నాగరాజు శర్మ అందజేశారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ మామిడి రాజు, నేరేళ్ల విజయ్, నాయిని నవీన్, చల్ల నవీన్ రెడ్డి, చంటి, అర్చకులు రుక్మభట్ల సీతరామశర్మ, పవన్ శర్మ, వేణు శర్మ, రాజేశ్వర్ శర్మ, అల్లాడీ ఆనంద్ శర్మ, లింగముూర్తి, సంతోష్ శాస్ర్తీ, నాగలింగం, తదితరులు పాల్గొన్నారు.

