
maknews (ఇల్లంతకుంట)
పూర్తిస్థాయిలో ఎలాంటి తప్పులకు తావివ్వకుండా “జనగణ 2027 మొదటి దశ” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చార్జ్ ఆఫీసర్, ఇల్లంతకుంట తహాసిల్దార్ సురేష్ కుమార్ సూచించారు. మండల కేంద్రంలోని హైస్కూల్లో 2027 జన గణన మొదటి దశ ఇండ్ల గణన కోసం ఏర్పాటుచేసిన శిక్షణలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్యుమరేటర్లకు మరియు సూపర్ వైజర్లకు ఆయన శిక్షణ అధికారిగా వ్యవహరించారు. ఈ సారి జనగణన మొత్తం డిజిటల్ విధానంలో జరుగుతున్నదని, హెచ్ ఎల్ ఓ (HLO) యాప్ గురించి పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని ఎన్యుమరేటలర్లకు, మరియు సూపర్ వైజర్లకు తెలియజేశారు. అదేవిధంగా డిజిటల్ విధానంలో ఎలాంటి తప్పుడు లేకుండా, పూర్తి స్థాయిలో నిజ వివరాలను మాత్రమే నమోదు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి చెప్పాల శ్రీనివాస్ గౌడ్, ఆర్ ఐ సంతోష్ రెడ్డి, ట్రైనర్లు సందీప్ రెడ్డి, స్వామి రెడ్డి, పాల్గొన్నారు.