
1Mak news/ఇల్లంతకుంట
ఆరుగాలం కష్టపడి శ్రమించి.. కొనుగోలు కేంద్రాల్లో అమ్మడానికి తీసుకువచ్చిన పొద్దుతిరుగుడు పంటను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదంటూ రైతులు రోడ్డేక్కారు.. ఇల్లంతకుంట మండల కేంద్రంలో పొద్దు తిరుగుడు పంట కొనుగోలు చేయాలని మండల కేంద్రంలోని వివేకానంద చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున రైతులు రాస్తారోకో చేపట్టారు. సుమారుగా 100 మంది రైతులు రోడ్డుపైకి వచ్చి పంట కొనుగోలు చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. మండలంలోని తాళ్లపల్లి, పత్తికుంటపల్లి,ముస్కాన్ పేట గాలి పెల్లి, కేశనపల్లి, జవారిపేట ,గ్రామాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించి వారి యొక్క నిరసనను వ్యక్తపరిచారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై అశోక్ కుమార్ రైతుల వద్దకు చేరుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కలెక్టర్, ఆర్డీఓ, తహాసీల్దార్ రావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో.. పొద్దుతిరుగుడు పంటను కొనుగోలు చేస్తలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు మార్కెట్ అధికారులను అడిగిన, ప్రజా ప్రతినిధులను కలిసి మొరపెట్టుకున్నా కూడా పట్టించుకోవడంలేదని వారు వాపయ్యారు. మండలంలో ఎనిమిది వేల పైగా క్వింటాళ్ల పొద్దుతిరుగుడు పంట నిల్వ ఉందని , మొత్తం పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు .
దీంతో రైతుల వద్దకు స్థానిక తహాసీల్దార్ రాజకట్ల సురేష్ కుమార్ రైతుల వద్దకు చేరుకొని మార్కెట్ ఎండితో, అదేవిధంగా ఉన్నత అధికారులతో ఫోన్లో మాట్లాడి రైతులకు నచ్చజెప్పారు. రైతుల పంటను త్వరలోనే కొంటామని హామీ ఇవ్వడంతో.. రైతులు ఆందోళన విరమింప చేశారు .. ఒక్కసారిగా రైతులు ప్రధాన చౌరస్తా వద్ద ఆందోళన చేపడంతో.. గంటసేపు వాహనదారులకు రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఈ కార్యక్రమంలో రైతులు జుట్టు శేఖర్, సింగిరెడ్డి మనోహర్ రెడ్డి, బోడ రమణారెడ్డి, చింతలపల్లి శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రెడ్డి, నరసింహ రెడ్డి, కూనవేని బాలరాజు, జుట్టు మధుసూదన్, ఎగుర్ల మల్లయ్య, బోడ మల్లారెడ్డి, గుర్రం నర్సింహారెడ్డి, వినోద్ రెడ్డి, మహేందర్, తిరుపతి రెడ్డి, బోడ తిరుపతి రెడ్డి
చింతలపల్లి రాజిరెడ్డి,
చింతలవపల్లి సత్యరెడ్డి
బోడ శ్రీనివాస్ రెడ్డి , రామరెడ్డి
గుర్రం సుదాకర్ రెడ్డి
రాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.