
MAKNEWS/ఇల్లంతకుంట
ఇల్లంతకుంట మండలం వెల్జిపూర్ గ్రామానికి చెందిన కొలనూరు సాన్విక రెడ్డి(8) 400 మీటర్ల పరుగు పందెంలో జిల్లా మొదటి స్థానం కైవసం చేసుకుని హౌరా అనిపించింది. వెల్జీపూర్ గ్రామానికి చెందిన కొలనూరు జితేందర్ రెడ్డి-ప్రణీత దంపతుల కూతురు సాన్విక(8) ఫస్ట్ క్లాస్ చదువుతుంది. సిరిసిల్లలోని శ్రీ చైతన్య పాఠశాలలో చదువుతున్న సాన్విక జిల్లాస్థాయిలో నిర్వహించిన 400 మీటర్ల పరుగు పందెంలో మొదటి స్థానంలో నిలిచి అందరిని అబ్బురపరిచింది. దీంతో రాష్ట్రస్థాయిలో జరిగే అథ్లెటిక్ పరుగు పందెం పోటీలకు ఎంపిక అయినట్లుగా నిర్వాహకులు తెలిపారు. సాన్విక ఎంపిక పట్ల తల్లిదండ్రులతో పాటుగా, వెల్జీపూర్ గ్రామ సర్పంచ్ నాయిని నవీన్ కుమార్, బతుకమ్మ ఘాట్ స్పోర్ట్స్ క్లబ్ ట్రైనర్లు సాయికుమార్, అశోకులు అభినందించారు.