
MAK NEWS
ఇల్లంతకుంట మండలంలోని అనంతారం గ్రామ ప్రభుత్వ జెడ్పిహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబర్చారు.వర్ణిత్ 533 మార్కులు, రుషిత్ సాయి 522, ఆదిత్య 518,వర్షిత 517, హర్షిత్ 483, మధుమిత 367 మార్కులు సాధించి పాఠశాలకు మంచి గుర్తింపు తీసుకువచ్చారు.విద్యార్థుల ప్రతిభను గుర్తిస్తూ గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వొల్లాల రజిత వెంకటేశం శాలువాలతో సన్మానించి అభినందించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు నాణ్యమైన విద్య అందించి విద్యార్థులను మంచి స్థాయికి తీసుకురావడం గొప్ప విషయమన్నారు.విద్యార్థులు ఇదే పట్టుదలతో ఉన్నత చదువులు అభ్యసించి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.ప్రధానోపాధ్యాయులు కె.శ్రీనివాస్ రెడ్డి,సత్యనారాయణ రెడ్డి విద్యార్థుల విజయంపై ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు గోనపల్లి లావణ్య వెంకటేశం,వొల్లాల లక్ష్మి కిష్టయ్య,కిష్ట కుమార్,బట్టి క్రాంతి,ఉపాధ్యాయులు జమున,అబ్దుల్ ఖుద్దూస్,ప్రవీణ్,కవిత,నర్సయ్య,శ్రీదేవి,పద్మ,హరిందర్ రెడ్డి,తల్లిదండ్రులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.